తమిళనాడు సీఎం , కోలీవుడ్ స్టార్ విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తొలిసారి మెగాఫోన్ పట్టిన మూవీ 'సిగ్మా' (Sigma) ఈ రోజు ( అక్టోబర్ 2న ) గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. దర్శకుడిగా జేసన్ తొలి ప్రయత్నం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ హై-ఓల్టేజ్ యాక్షన్-అడ్వెంచర్ అండ్ హీస్ట్ థ్రిల్లర్‌లో యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్‌లో అలరించారు. ఈ మూవీకి థియేటర్లలో మొదటి ఆట నుంచే ఊహించని రెస్పాన్స్ వస్తోంది.
అయితే.. సినిమా కంటే కూడా చెన్నైలోని ప్రముఖ కమల్ థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఒక ఎమోషనల్ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొంతకాలంగా సీఎం విజయ్‌తో తీవ్ర విబేధాలు ఉన్నాయని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ సంగీతపై రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రూమర్స్ వచ్చినప్పటి నుంచి ఆమె మీడియా కంట పడకుండా చాలా దూరంగా ఉంటున్నారు.
కానీ.. జేసన్ సంజయ్ తొలి సినిమా చూసేందుకు ఆయన తల్లి సంగీత, సోదరి దివ్య సాషా చెన్నైలోని కమలా సినిమాస్‌కు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షోను ప్రత్యేకంగా తిలకించారు. థియేటర్ వద్ద కెమెరాలకు చిక్కిన సంగీత వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా కాలంగా పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా కనిపించిన ఆమె.. కొడుకు జీవితంలో ఎంతో కీలకమైన ఈ రోజున థియేటర్‌కు రావడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ఇక మరోవైపు, కొడుకు ప్రతిష్టాత్మక చిత్రానికి సీఎం విజయ్ కూడా హాజరవుతారని ఫ్యాన్స్ ఎంతగానో ఆశించారు. కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభోత్సవం, ఆ వెంటనే మధురాంతకంలో ఎన్నికల ప్రచారం వంటి రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఆయన ఫస్ట్ షోకు రాలేకపోయారని టాక్. రూ.500 కోట్ల భారీ దోపిడీ అండ్ ట్రెజర్ హంట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ 'సిగ్మా'తో జేసన్ డైరెక్టర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు, విజయ్ కుటుంబంలో వచ్చిన ఈ పిక్ కోలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకే తెరలేపింది..
முதல் அமைச்சர் தளபதி விஜய் மனைவி சங்கீதா மகள் சாஷா சிக்மா பார்க்க வந்த காட்சி pic.twitter.com/0J1NQ58Dp4
— Anshitha🫶💖🍉 (@Anshithaprincey) October 2, 2026
