కాకా’ ఫౌండేషన్ఆధ్వర్యంలో  పోలీస్ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్

కాకా’ ఫౌండేషన్ఆధ్వర్యంలో  పోలీస్ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్
  •     నేడు మందమర్రి, చెన్నూరులో ఫ్రీ కోచింగ్​సెంటర్లను ప్రారంభించనున్న మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ 

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడుతున్న యువతీయువకులకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్​ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేందుకు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని మందమర్రి, చెన్నూరు పట్టణాల్లో ఫ్రీ కోచింగ్​సెంటర్లను ఏర్పాటు చేశారు. చెన్నూరు మున్సిపాలిటీలోని మహిళా భవన్, మందమర్రిలోని తహసీల్దార్​ఆఫీస్​ఎదుట ఉన్న భవనం(షెడ్డు)లో ఏర్పాటు చేసిన కోచింగ్​సెంటర్లను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం ప్రారంభించనున్నారు. సుమారు మూడు నెలల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు.