సనత్‌‌నగర్‌‌ టిమ్స్ లో ఆరోగ్య మిత్ర పోస్టులకు వాక్- ఇన్ ఇంటర్వ్యూ

సనత్‌‌నగర్‌‌ టిమ్స్ లో ఆరోగ్య మిత్ర పోస్టులకు వాక్- ఇన్ ఇంటర్వ్యూ

హైదరాబాద్ సిటీ, వెలుగు: సనత్‌‌నగర్‌‌ టిమ్స్ హాస్పిటల్​లో ఔట్‌‌సోర్సింగ్ విధానంలో  ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా.సాయినారాయణ గౌడ్ తెలిపారు. గ్రాడ్యుయేషన్, డీసీఏ అర్హత ఉన్నవారు నెలకు రూ.19,500 వేతనానికి అర్హులని పేర్కొన్నారు. 

ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ హరిహర కళాభవన్ ఎదురుగా ఉన్న ఎన్‌‌టీపీసీ భవనం 4వ అంతస్తులోని డీఎంహెచ్‌‌ఓ ఆఫీసులో జరిగే వాక్- ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.  22 నుంచి 25 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 27-, 28న అభ్యంతరాల స్వీకరణ, 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఎంపిక జాబితా ప్రదర్శిస్తామని తెలిపారు. నియామకాలు కలెక్టర్ ఆదేశాల ప్రకారం జరుగుతాయని పేర్కొన్నారు.