ముంబై: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) సభ్యుల గైర్హాజరు (కోరమ్) వల్ల వాయిదా పడింది. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ కలిసి ప్రతినిధిని నామినేట్ చేయాల్సి ఉండగా, సమావేశానికి రాలేదు.
టాటా ట్రస్ట్ సంస్థలకు టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటా ఉంది. మహారాష్ట్ర చారిటీస్ కమిషనర్ ఆదేశాల కారణంగా సర్ రతన్ టాటా ట్రస్ట్ ప్రధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుత చైర్మన్ చంద్రశేఖరన్ తిరిగి కొనసాగడానికి నిరాకరించిన నేపథ్యంలో ముంబైలో జరిగిన ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది.
