హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయితీరాజ్ సంఘటన్ (ఆర్జీపీఆర్‌ఎస్) చైర్మన్‌గా రాజేంద్ర ప్రసాద్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, పార్టీ సిద్ధాంతాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ యాదవ్‌కు కేసీ వేణుగోపాల్ సూచించారు.
