చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి.. రూ. 50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి.. రూ. 50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు. 2026 ఆగస్టు 18న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి పర్యటిస్తున్న ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 50 లక్షల రూపాయల సింగరేణి CSR నిధులతో పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపన చేశారు.

విద్యార్థుల సౌకర్యార్థం ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అదనపు గదుల నిర్మాణానికి నిధుల కేటాయించనున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. మంత్రితో పాటు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 

మంత్రి వివేక్ కామెంట్స్ :

  • ఆశ్రమ పాఠశాలలో వసతుల కల్పనకు ఎక్కువ నిధులు కేటాయించాలని స్థానిక నాయకులు కోరారు
  • నేను గెలిచిన తరువాత ఈ స్కూల్ పరిస్థితి చూడడం జరిగింది
  • ఆశ్రమ పాఠశాలలో వసతుల కల్పనకు 80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది 
  • చక్కటి కిచెన్ డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది 
  • ఇక్కడ సోషల్ వెల్ఫర్ హాస్టల్ కు 15 లక్షల రూపాయల నిధులు కేటాయించాను 
  • ఇక్కడ బాత్ రూం సదుపాయాలు లేవని బీ ఆర్ ఎస్ నాయకులు సోషల్ మీడియా లో పెట్టారు
  • కానీ పది సంవత్సరాలు బాల్క సుమన్ హయంలోనే జరగాల్సిన పని.. ఎందుకు చేయలేదో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి
  • 97 శాతం ఉత్తీర్ణత ఉందని తెలిపారు ఇంకా ఎక్కువ చదివి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
  • సోమనపల్లి గ్రామంలో 250 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.
  • ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాము
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల టీచర్లను భర్తీ చేయడం జరిగింది.
  • ఇక్కడ జనాభాకు అనుకూలంగా 100 పడకల ఆసుపత్రి భవనాన్ని సెప్టెంబర్ 4న ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది.
  • ఇప్పటికే 23 మంది డాక్టర్లు రావడం జరిగింది.
  • చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది
  • స్థానిక ప్రజలు అందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి.