ఆదిలాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ స్థలం కబ్జా .!

ఆదిలాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ స్థలం కబ్జా .!

 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల స్థలంపై అక్రమణకు పాల్పడ్డారంటూ కళాశాల అధికారులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కళాశాల బయట ఉన్న స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి, అక్కడ పోల్స్ ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు.

కళాశాలకు సంబంధించిన స్థలంలో ఉన్న హరితహారం మొక్కలను తొలగించి అక్రమంగా స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కళాశాల అధికారులు ఆరోపించారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.అక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కళాశాలకు సంబంధించిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేయించాలని కోరుతూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

కళాశాల ఆస్తులకు రక్షణ కల్పించాలని, ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి కళాశాలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కళాశాల అధికారులు కోరుతున్నారు. ఈ ఫిర్యాదుపై మున్సిపల్ అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.