రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ..ఏసీబీకి చిక్కిన మెహిదీపట్నం టౌన్ ప్లానింగ్ అధికారి

రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ..ఏసీబీకి చిక్కిన మెహిదీపట్నం టౌన్ ప్లానింగ్ అధికారి

హైదరాబాద్:  లంచం తీసుకుంటూ మెహిదీపట్నం టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్  ఏసీబీకి చిక్కారు. ఇవాళ  మెహిదీపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన సూపర్‌వైజర్ సునీత 8లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికింది. 

ఓ నిర్మాణ భవనానికి సంబంధించిన అనుమతుల విషయంలో సునీత రూ.8 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  అనంతరం కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, సంబంధిత పత్రాలు, రికార్డులను పరిశీలించారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.