ఈహెచ్ సీటీ హాస్పిటల్స్ లిస్టు ప్రకటించాలి : పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య

ఈహెచ్ సీటీ హాస్పిటల్స్ లిస్టు ప్రకటించాలి : పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య

హైదరాబాద్, వెలుగు: టీచర్లు, ఎంప్లాయీస్ వేతనాల నుంచి మూడు నెలలుగా 1.5 శాతం నిధులు కోత విధిస్తున్న ప్రభుత్వం.. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అమలులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపించారు. ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఏయే ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుతాయి? అనే వివరాలను ప్రభుత్వం వెంటనే అధికారికంగా ప్రకటించాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

చర్చల పేరుతో కాలయాపన చేయకుండా నగదు రహిత చికిత్స అందించే హాస్పిటళ్ల జాబితాను విడుదల చేయాలని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 36 నెలలు గడిచినా పీఆర్సీ అమలు కాకపోవడం, 6 డీఏల  బకాయిలు పెండింగ్‌‌‌‌లో ఉండటంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న వారి జీతాల్లో కోతలు విధించడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.