కేటీఆర్ పాత్రను పోషిస్తున్న రాంచందర్ రావు విప్ బల్మూరి వెంకట్ ఫైర్

కేటీఆర్ పాత్రను పోషిస్తున్న రాంచందర్ రావు విప్ బల్మూరి వెంకట్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ శికారికి వెళ్లారని, ఆయన వచ్చేదాక తన బావ దూసుకెళ్లకుండా తన పాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు అప్పగించారని విప్ బల్మూరి వెంకట్ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు.

బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణకు మొండి చెయ్యి చూపిందని, ఉన్న పదవులు తీసేసినా.. ఇక్కడి నేతల తీరు మారడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ వల్లే అరవింద్​కుటుంబం నేడు ఈ స్థాయికి వచ్చిందని, అలాంటిది ఇప్పుడు  కాంగ్రెస్​ను విమర్శించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.