టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలసి నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' బాక్సాఫీస్ వద్దబ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరు కలసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 16న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ విడుదల చేస్తున్న కీలక అప్డేట్స్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. లేటెస్ట్ గా మూవీ సెట్స్ నుంచి విజయ్ దేవరకొండ ఒక సరదా బిహైండ్ ద సీన్స్ (BTS) వీడియోను షేర్ చేశారు. ఇందులో విజయ్ ఊరమాస్ అవతారంలో ఉన్న ఊయల కుర్చీ వద్దకు రష్మిక నడుచుకుంటూ వచ్చి.. సినిమాలో ఆయన చెప్పే "దిస్ ఈజ్ సింగనమల బొబ్బిలి రణబాలి' అనే పవర్‌ఫుల్ డైలాగ్‌ను క్యూట్‌గా రీ-క్రియేట్ చేసింది. డైలాగ్ చెప్పిన వెంటనే ఆమె సిగ్గుపడుతూ ముఖం దాచుకున్న క్షణాలు రౌడీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను షేర్ చేస్తూ విజయ్.. 'ఆమె మై క్యూట్ శావేజ్.. రోజూ నాకు కావాల్సిన అసలైన డిస్ట్రాక్షన్' అంటూ స్వీట్ క్యాప్షన్ ఇచ్చారు.
1854 నుండి 1878 కాలం నాటి బ్రిటిష్ పాలన, రాయలసీమ ప్రాంతంలో జరిగిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటం నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. ఈ సినిమా నేపథ్యాన్ని వివరించేందుకు మేకర్స్.. 2 ఏళ్ల పరిశోధనతో కూడిన 'రణబాలి - నెవర్ ఫర్గెట్' అనే 4 భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌ను కూడా విడుదల చేశారు.
రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ 'రణబాలి'గా, రష్మిక 'జయమ్మ'గా అలరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ స్టార్ 'ది మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. పెళ్లి తర్వాత మొదటి సినిమా కావడం, విజయ్-రష్మిక కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్‌లో ఉండటంతో అక్టోబర్ 16న బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..
Best Couple 💕👌🏻#VijayDeverakonda #Rashmika pic.twitter.com/Qphqm0JnqQ
— Anonymous (@__GirDhar) October 3, 2026
