Bigg Boss Telugu 10 : 'నువ్వు కెప్టెన్సీకే పనికిరావు'.. రామ్ ప్రసాద్‌, అపూర్వలకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్!

Bigg Boss Telugu 10 : 'నువ్వు కెప్టెన్సీకే పనికిరావు'.. రామ్ ప్రసాద్‌, అపూర్వలకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్!

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 10 ' హౌస్‌లో వీకెండ్ ఎపిసోడ్ అంటేనే కంటెస్టెంట్లకు టెన్షన్ మొదలవ్వా్ల్సిందే. రోజంతా హౌస్‌లో ఏమి చేసినా, వీకెండ్ వచ్చేశారంటే చాలు 'కింగ్' నాగార్జున ముందు నిలబడి లెక్కలు చెప్పాల్సిందే. లేటెస్ట్ గా శనివారం ఎపిసోడ్ ప్రోమోతో బిగ్ బాస్ లవర్స్‌కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.. వారం రోజంతా హౌస్‌మేట్స్ చేసిన రచ్చ, నిబంధనల ఉల్లంఘనలు, పర్సనల్ ఎటాక్‌లపై హోస్ట్ నాగార్జున తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్..

హౌస్‌లో కంటెస్టెంట్లు ఆడుతున్న తీరుపై, ముఖ్యంగా గ్రూపిజం, నామినేషన్ల సమయంలో హద్దులు దాటి ప్రవర్తించడంపై నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "ఇది బిగ్ బాస్ హౌస్.. మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి కాదు" అంటూ కంటెస్టెంట్లకు స్వీట్ వార్నింగ్‌తో కూడిన గట్టి క్లాస్ పీకారు. టాస్క్‌లలో దిగజారి ప్రవర్తించిన తీరుపై నాగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో, హౌస్‌మేట్స్ ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యారు. తప్పు చేసిన వారికి ఏమాత్రం మినహాయింపు ఇవ్వకుండా, నేరుగా వారి ముఖం మీదే ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిలదీశారు.

నీవు కెప్టెన్సీకే పనికిరావు.. 

ఈ ప్రోమో చూస్తే బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లకు నాగార్జున ఫుల్ క్లాస్ పీకినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తొలుత నాగార్జున 'రోహిత్, త్రిగుణ్, అమన్... గెట్ అవుట్ ఆఫ్ ది లివింగ్ రూమ్'అంటూ వారిని గార్డెన్ ఏరియాకు పంపించేశారు. ఆ తర్వాత కెప్టెన్ అపూర్వపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'కెప్టెన్ రూమ్‌ను నువ్వు వాడిన విధానం కరెక్టా? నువ్వు మొత్తం హౌస్‌కి కెప్టెన్వా? లేక కేవలం రెడ్ టీమ్‌కి మాత్రమేనా? అసలు నువ్వు కెప్టెన్సీకే పనికిరావు' అంటూ గట్టిగానే ఇచ్చిపడేశారు.

కన్నింగ్ రామ్ ప్రసాద్ .. 
అనంతరం రామ్ ప్రసాద్‌ను నిలబెట్టి క్లాస్ తీసుకున్నారు. 'నువ్వేమైనా పిస్తా అనుకుంటున్నావా? నామినేషన్ల గురించి డిస్కషన్ చేయవద్దని పోయిన వారమే చెప్పాను... అయినా వినలేదు. అందుకే నిన్ను 'కన్నింగ్' అనేది" అంటూ నిలదీశారు. ఆ తర్వాత షాలినికి కూడా గట్టి హెచ్చరికే ఇచ్చారు. 'నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా?' అంటూ క్లాస్ పీకారు. హౌస్‌లో మీ బిహేవియర్, మాట్లాడే తీరును చూసి ఆడియన్స్ అసహ్యించుకుంటే... మీరు ఎక్కడ ఉండాలో వాళ్ళే డిసైడ్ చేస్తారంటూ ఒక్కొక్కరి తీరుపై నాగార్జున తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

బిహేవియర్ మార్చుకోకపోతే..

గత కొద్ది రోజులుగా హౌస్‌లో జరిగిన గొడవలు, బాడీ షేమింగ్ లేదా పర్సనల్ కామెంట్స్‌‌పై నాగ్ క్లారిటీ ఇవ్వడమే కాకుండా, సేఫ్ గేమ్ ఆడుతున్న వారి మాస్క్‌లను సైతం తొలగించే ప్రయత్నం చేశారు. కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి క్లాస్ పీకుతుంటే కంటెస్టెంట్లు నోరెళ్లబెట్టి, సైలెంట్‌గా తలదించుకోవడం ప్రోమోలో స్పష్టంగా కనిపిస్తోంది.

వీకెండ్ వచ్చిందంటే నాగార్జున ఇచ్చే డోస్ ఎలా ఉంటుందో ఈ ప్రోమో మరోసారి నిరూపించింది. సీరియస్ లుక్‌తో కనిపించిన నాగ్ ఈసారి ఎవరికీ సడలింపు ఇచ్చేలా లేరని స్పష్టమవుతోంది. నాగ్ వేసిన ప్రశ్నలకు కంటెస్టెంట్లు ఎలాంటి సమాధానాలు చెప్పారు? ఈ వారం రెడ్ కార్డ్ ,  ఎలిమినేషన్ ఎవరికి ఎదురవుతుంది? అనేది తెలియాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్‌ను చూడాల్సిందే..