పసిడి పంచ్‎తో ముగింపు.. ఆసియా క్రీడల్లో భారత్‏కు మొత్తం 85 పతకాలు

పసిడి పంచ్‎తో ముగింపు.. ఆసియా క్రీడల్లో భారత్‏కు మొత్తం 85 పతకాలు

టోక్యో: 2026 ఆసియా క్రీడలను భారత్ స్వర్ణ పతకంతో ఘనంగా ముగించింది. భారత హాకీ పురుషుల జట్టు మలేషియాను చిత్తు చేసి దేశానికి చివరి గోల్డ్ మెడల్ అందించింది. జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 85 పతకాలు సాధించింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. అథ్లెటిక్స్ విభాగంలో భారత్‎కు అత్యధికంగా 24 పతకాలు రాగా.. షూటింగ్ ఈవెంట్‎లో 15 పతకాలు లభించాయి. 

 ఓవరాల్‏గా పతకాల పట్టికలో ఇండియా నాల్గవ స్థానంలో నిలిచింది. 341 పతకాలతో చైనా తొలి స్థానం కైవసం చేసుకుంది. అతిథ్య జపాన్ 269 మెడల్స్‎తో సత్తా చాటింది. దక్షిణ కొరియా పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్‌తో సమానంగా 21 స్వర్ణాలు సాధించినప్పటికీ రజత పతకాలు ఎక్కువగా ఉండటం వల్ల భారత్ ఒంటరిగా 4వ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 

చివరి రోజు భారత్ జోరు

ఆసియా క్రీడల చివరి రోజైన శనివారం (అక్టోబర్ 3) భారత అథ్లెట్లు అదరగొట్టారు. టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌ను చిత్తు చేసి స్వర్ణ పతకం సాధించింది. పురుషుల హాకీ జట్టు మలేషియాను 5-1తో ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రణవి అర్స్ బంగారు పతకం సాధించింది. తద్వారా గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగంలో దేశానికి స్వర్ణ పతకం అందించిన తొలి అథ్లెట్‎గా రికార్డ్ రికార్డు సృష్టించింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ అద్భుతమైన ఆటతీరుతో స్వర్ణ పతకాన్ని సాధించాడు.