బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో హైడ్రామా.. అమన్‌కు ఎల్లో కార్డ్.. ముఖేష్ గౌడకు మాస్ వార్నింగ్!

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో హైడ్రామా.. అమన్‌కు ఎల్లో కార్డ్.. ముఖేష్ గౌడకు మాస్ వార్నింగ్!

రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో శని, ఆదివారాల ఎపిసోడ్లకు ఉండే క్రేజ్ వేరు. వారం అంతా హౌస్‌మేట్స్ చేసిన రచ్చ, గొడవలు, వ్యూహాలకు నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. 'డే 27 ఎపిసోడ్'( అక్టోబర్-3 2026)  హౌస్‌లో వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో చూస్తే.. నాగార్జున సీరియస్ లుక్‌తో స్టేజ్ మీదికి వచ్చి కంటెస్టెంట్లకు గట్టి క్లాస్ తీసుకున్నారు. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన వివిధ టాస్కులు, గొడవల్లో కొందరు సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా రూల్స్ అతిక్రమించిన వారిని, నామినేషన్లు , టాస్కుల్లో అనవసర డ్రామా సృష్టించిన వారిని నాగార్జున క్లియర్ వీడియో ఆధారాలతో సహా ఎండగట్టారు.

నాగార్జున ఎంట్రీతోనే సభ్యుల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. 'ఆట ఆటలా ఆడాలి కానీ, వేరేవాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు' అని నాగ్ స్పష్టం చేశారు. తప్పులు చేసిన కంటెస్టెంట్లు సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, నాగార్జున కట్ అండ్ రైట్‌గా వారి వాదనలను తిప్పికొట్టారు. ఈ క్లాస్‌తో హౌస్‌మేట్స్‌కు తమ స్థానమేమిటో, గ్రాఫ్ ఎక్కడ పడిపోతుందో అర్థమయ్యేలా చేశారు.

హౌస్‌లో ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలపై ముఖేష్ గౌడకు నాగార్జున గట్టి క్లాస్ పీకారు. "మెయింటెన్ చేస్తున్నావా?" అని రోహిత్‌ను ఉద్దేశించి అన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా సీరియస్ అయ్యారు. "చిన్నదో వైపు, పెద్దదో వైపు" అంటూ మాట్లాడిన అసభ్య పదజాలం ఏంటని ప్రశ్నిస్తూ గట్టిగా నిలదీశారు.

ఈ విషయంలో ఝాన్సీ కూడా రోహిత్ చేసింది తప్పేనని నాగార్జునకు సమాధానమిచ్చింది. దీంతో, రోహిత్ తన తప్పు తెలుసుకుని అందరికీ క్షమాపణలు చెబుతున్నాడని వర్షిణి తెలియజేసింది. ఈ సందర్భంగా నాగార్జున హెచ్చరిస్తూ.. 'ఇలా మాట జారుతూ పోతే ఆడియన్స్ కూడా నిన్ను పక్కన పెట్టేస్తారు' అని ముఖేష్‌కి వార్నింగ్ ఇచ్చారు.

ఆ తర్వాత అమన్ కు కూడా నాగార్జున తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. టాస్కుల్లో అతను వ్యవహరించిన తీరును తప్పుపట్టారు.'ఆటలో తగలకూడని చోట దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటి?' అని ప్రశ్నించారు. 'బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు ఆడుతున్నావా... లేక బస్తీలో దొమ్మీలు ఆడుతున్నావా?' అని సీరియస్ అయ్యారు. అమన్  ప్రవర్తనకు గానూ నాగ్ ఆయనకు ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఇంకొసారి ఇలాగే ప్రవర్తిస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి నేరుగా బయటకు పంపించేస్తాం అంటూ నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు ఈ ప్రోమోలో ఎలిమినేషన్ ఉత్కంఠను కూడా పెంచేశారు. డేంజర్ జోన్‌లో ఉన్న వారి పేర్లను ప్రస్తావిస్తూ, నామినేషన్లలో ఉన్న సభ్యుల్లో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారనే సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు. సభ్యులంతా సైలెంట్‌గా ఉండి నాగార్జున మాటలను వినడం, కొందరు కంటెస్టెంట్లు కంగారుపడటం ప్రోమో అంతటా కనిపిస్తుంది.

మొత్తానికి, ఈ  వీకెండ్ ఎపిసోడ్‌పై అంచనాలను భారీగా పెంచేసింది. నాగార్జున ఫైర్ అవ్వడం, సభ్యులకు వార్నింగ్ ఇవ్వడం, ఎలిమినేషన్ ట్విస్ట్‌లు చూడాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.