పసిడి రూ.రెండు వేలు జంప్..10 గ్రాముల ధర రూ.1.58 లక్షలకు

పసిడి రూ.రెండు వేలు జంప్..10 గ్రాముల ధర రూ.1.58 లక్షలకు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం ధర మంగళవారం రూ.రెండు వేలు పెరిగి రూ.1,58,800 కు చేరుకుంది.  వెండి ధర కూడా కిలోకు రూ.730 పెరిగి రూ.2,40,730 కి చేరింది. పశ్చిమాసియాలో  ఆందోళనల కారణంగా ముడిచమురు ధరలు పుంజుకోవడంతో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి.

యూఎస్​ఫెడ్​ వడ్డీ రేట్ల అంచనాలు, చైనా కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇస్తున్నాయి. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశంపై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకృతమైంది. జాక్సన్ హోల్ సదస్సు వరకు బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉంది.