మూడో బిడ్డకూ ఏడాది ప్రసూతి సెలవులు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

మూడో బిడ్డకూ ఏడాది ప్రసూతి సెలవులు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డకూ ఏడాది ప్రసూతి సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగినులకు మూడో సంతానానికి కూడా ఏడాది పాటు ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు 2026 ఆగస్టు 18న ప్రకటించింది. 

ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలకు మాత్రమే ఏడాది పాటు ప్రసూతి సెలవులు లభించేవి. ఆ తర్వాత కలిగే సంతానానికి 12 వారాలు మాత్రమే సెలవులు మంజూరు చేసేవారు. లేటెస్టు నిర్ణయంతో ఇక నుంచి మూడో బిడ్డకూ ఏడాది సెలవులు మంజూరు చేయనుంది తమిళ ప్రభుత్వం. 

2026 ఆగస్టు 18న మానవ వనరుల శాఖ మంత్రి డి.శరత్ కుమార్ అసెంబ్లీలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. మహిళా సాధికారత, సంక్షేమానికి పెద్ద పీట వస్తున్న తమ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు మూడో బిడ్డకు కూడా ప్రస్తూతి సెలవులు ఏడాది ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న 84 రోజుల సెలవులను 365 రోజులకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. 

ఇద్దరి కంటే ఎక్కువ సంతానం విషయంలో మహిళలకు 12 వారాల సెలవులను సుప్రీం కోర్టు తీర్పుతోఅమలు చేస్తున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం అనే నిబంధనతో మహిళకు ప్రసూతి సెలవులు నిరాకరించడం తగదని సుప్రీం ఆదేశాలతో 12 వారాల సెలవులు అమలవుతున్నాయి. 

బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే..  

 అసెంబ్లీకి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే ఆర్ పల్లవి ( టీవీకే ) బిడ్డతో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. బేబిని అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత కేర్ గివర్ కు ఇచ్చి అసెంబ్లీ మెయిన్ హాల్ కు వెళ్లింది. 

అయితే బిడ్డతో వచ్చి సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన విమర్శలపై ఆమె స్పందించారు. బిడ్డను ఇంటి దగ్గర వదిలేసి రాలేనని చెప్పారు. కామెంట్స్ చేసే ముందు ఆలోచించి మాట్లాడాల్సిందిగా ఆమె చెప్పారు.