ఎడపల్లి పీఏసీఎస్లో గోల్ మాల్.. రూ.28 లక్షల దుర్వినియోగం

ఎడపల్లి పీఏసీఎస్లో గోల్ మాల్.. రూ.28 లక్షల దుర్వినియోగం

ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్  జిల్లా ఎడపల్లి పీఏసీఎస్​లో రూ.28 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఇటీవల నిర్వహించిన ఆడిట్ లో ఈ వ్యవహారం వెలుగు చూడగా, నిధులు దుర్వినియోగం చేసిన సేల్స్​మెన్ల నుంచి రికవరీ చేయాలని మంగళవారం జిల్లా కో ఆపరేటివ్  బ్యాంక్​ అధికారులకు పీఏసీఎస్​ చైర్మన్​ పోల మల్కారెడ్డి, సెక్రటరీ రాజారాం వినతిపత్రం అందజేశారు. ఎడపల్లి పీఏసీఎస్​ పరిధిలో ఎడపల్లి, తానాకలాన్, కుర్నాపల్లి గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలున్నాయి. వీటిలో ముగ్గురు సేల్స్​మెన్లు​ఎరువులు అమ్ముతారు. ఎరువులు అమ్మగా వచ్చిన డబ్బులను వీరు రెండేళ్లుగా పీఏసీఎస్​ ఖాతాలో జమ చేయలేదు. ఎడపల్లి సేల్స్​మెన్​ రూ.25 లక్షలు, తానాకలాన్​ సేల్స్​మెన్​ రూ.3 లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఆడిట్​లో తేలింది.