కామారెడ్డి, వెలుగు: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కూతురు జోనిట, దాస్ వివాహ ముందస్తు విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం బిచ్కుందలో జరిగిన ఈ వేడుకలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.
హెలికాప్టర్‌లో బిచ్కుందకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర స్వాగతం పలికారు. అనంతరం సీఎం కొద్దిసేపు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడారు.
