కామారెడ్డి, వెలుగు: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో ఏకాంతంగా భేటీ అయ్యారు. బిచ్కుందలో జరిగిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్‌రావు కూతురు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు సీఎం హాజరై, తిరిగి వెళ్తూ తన కాన్వాయ్‌లోని బస్‌లో ఎమ్మెల్యే పోచారంతో సీఎం ముచ్చటించారు. 5 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో వీరిద్దరే ఉన్నారు. వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనే సంగతి బయటకు రానప్పటికీ, వారి భేటీ చర్చనీయాంశమైంది. ఇటీవల పోచారం చేసిన హాట్‌కామెంట్స్ చేసిన క్రమంలో వీరి భేటీ హాట్ టాపిక్‌గా మారింది.
