హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఎలాంటి లొల్లి లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండానే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, కావాలంటే బాండ్ పేపర్ రాసిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రోజుల తరబడి అమెరికా పర్యటన బాధ్యత రాహిత్యమని ఆయన విమర్శించారు.
తన తండ్రి లేకుండా యూపీఏ1, యూపీఏ2 లేదని.. అలాంటిది తాను తన తండ్రి పేరు చెప్పుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. సర్ కొత్తగా చేపట్టిన ప్రక్రియ కాదని.. ఓట్లు పోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీ ఫామ్ దేనికి ఇస్తే దానికి పోటీ చేస్తానని అర్వింద్ వెల్లడించారు.
