ఆలస్యంగా ఆదర్శ కుటుంబం.. త్రివిక్రమ్ సినిమాకూ తప్పని రిలీజ్ కష్టాలు !

ఆలస్యంగా ఆదర్శ కుటుంబం.. త్రివిక్రమ్ సినిమాకూ తప్పని రిలీజ్ కష్టాలు !

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 AK47’ చిత్రం విడుదల వాయిదాపడింది. అక్టోబర్ 9న  విడుదల కావాల్సిన ఈ సినిమాను పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో నాగవంశీ మాట్లాడుతూ ‘అక్టోబర్ 9న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఓవర్సీస్ సెన్సార్‌‌‌‌‌‌‌‌కు కూడా కంటెంట్ అందించలేని పరిస్థితి నెలకొంది.  పోస్ట్ ప్రొడక్షన్ పనులు మూడు, నాలుగు రోజులు వెనుకబడటంతో కంగారుగా సినిమాను విడుదల చేయడం కంటే, క్వాలిటీ అవుట్‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాయిదా నిర్ణయం తీసుకున్నాం.

మరో రెండు, మూడు వారాల్లో వెంకటేష్‌‌‌‌‌‌‌‌తో చర్చించి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. అప్పటివరకు మిగతా పాటలు, ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయడంతోపాటు  ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తాం.  సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినా వెంకటేష్ అభిమానులు నూటికి నూరు శాతం సంతృప్తి చెందేలా ఉంటుంది’ అని అన్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.