గోల్డ్ షోరూమ్లో రూ.2 కోట్ల నగలు చోరీ

గోల్డ్ షోరూమ్లో రూ.2 కోట్ల నగలు చోరీ
  • మొత్తం 580 ఆభరణాలను ఎత్తుకెళ్లిన దుండగులు
  • మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో ఘటన

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవేపై ఉన్న  క్యారెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- టాటా గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ దొంగతనం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి పక్కా ప్రణాళికతో వచ్చిన దుండగులు షోరూమ్ షట్టర్లు వంచి, లోపలికి వెళ్లి సుమారు 1.4 కిలోల బరువున్న 580 బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని ఉప్పల్ ​డీసీపీ సురేశ్​కుమార్ ​తెలిపారు.

వీటి విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. చోరీకి గురైన వాటిలో 435 ఉంగరాలు, 88 బ్రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్లు, 19 గాజులు, 17 నెక్లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 9 చెవిరింగులు, 8 పెండెంట్లు, 2 గొలుసులు, ఒక మంగళసూత్రం, ఒక ముక్కు పుడక ఉన్నాయన్నారు.

సోమవారం ఉదయం షోరూమ్​ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్లూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆధారాలు సేకరించామని తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు నిందితులు పాల్గొని ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

చోరీ అనంతరం వారు ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించామన్నారు. నిందితుల ఆచూకీ కోసం 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.