రాహుల్ గాంధీతో మధుయాష్కీ భేటీ

రాహుల్ గాంధీతో మధుయాష్కీ భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌ను రాజకీయాలు, పాలసీ రూపకల్పన, ప్రజా సమస్యలు, దేశ నిర్మాణంతో అనుసంధానం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆల్ ఇండియ ప్రొఫెషనల్స్ కమిటీ(ఏఐపీసీ) చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ఇందుకోసం వచ్చే ఏడాది కాలానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

సోమవారం ఢిల్లీలోని జన్ పథ్ 10లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో యాష్కీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో ఏఐపీసీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత విస్తరణ, దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌ను ఏకం చేయడం, పాలసీ మేకింగ్‌‌‌‌‌‌‌‌లో నిపుణుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆర్కిటెక్టులు, టీచర్లు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు, ఆర్టిస్టులు, స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, స్కిల్డ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ సహా అన్ని రంగాల నిపుణులను తమ కమిటీలో భాగస్వాములను చేయాలని రాహుల్ గాంధీ సూచించారని  మధుయాష్కీ గౌడ్ తెలిపారు.

ఏడాది పాటు రాష్ట్రాల పర్యటనలు, స్థానిక కమిటీల ఏర్పాటు, ప్రొఫెషనల్స్ సమావేశాలు, పాలసీ డైలాగ్స్ నిర్వహించి, చివరగా దేశవ్యాప్తంగా ప్రతినిధులతో నేషనల్ ప్రొఫెషనల్ కన్వెన్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.