ఆలోచింపజేసే మెట్రో లవర్ సినిమా

ఆలోచింపజేసే మెట్రో లవర్ సినిమా

నరేన్ వనపర్తి, సాహితీ అవంచ జంటగా  మహేష్ నాంపల్లి దర్శకత్వంలో మాల్య కందుకూరి, శివకుమార్ రాజంపేట, గడ్డం రవి కుమార్, సంతోష్ జాదవ్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మెట్రో లవర్’. నవంబర్ 20న  సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. సోమవారం టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథులుగా  హాజరైన  డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, నిర్మాత బెక్కెం వేణుగోపాల్   ఈ  సినిమా  పెద్ద విజయం సాధించాలని కోరారు.

ఇది నెక్స్ట్ లెవల్ స్టోరీ అని, సినిమా చూసి  సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అవుతారని నరేన్ అన్నాడు. ఇప్పటివరకు ఇలాంటి కథ రాలేదని ఆడియన్స్‌‌‌‌‌‌‌‌కు మంచి అనుభూతిని పంచుతుందని డైరెక్టర్ మహేష్ నాంపల్లి చెప్పాడు.   మంచి కంటెంట్‌‌‌‌‌‌‌‌తో రాబోతున్న ఈ  చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుందని  నిర్మాతలు అన్నారు. ఆలోచింపజేసే, పద్ధతిగల సినిమా ఇదని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అన్నాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.