- పాల్గొననున్న కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, వంశీకృష్ణ, ఇతర ఎంపీలు
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, బీజేపీ ఓట్ చోరీ విధానాలను నిరసిస్తూ.. ఇండియా కూటమి నేతలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ టూ ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’ వరకు ప్రతిపక్ష ఎంపీల నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.
పార్లమెంట్ ఆవరణలోని మకర్ ద్వార్ ప్రాంతం నుంచి ఎంపీల మార్చ్ ప్రారంభమై ఈసీఐ కార్యాలయం వైపు సాగనుంది. ఈ ర్యాలీలో తెలంగాణకు చెందిన ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, ఇతర ఎంపీలు పాల్గొననున్నారు.
ముఖ్యంగా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణను రద్దు చేయడం, ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను తిరిగి ప్రవేశపెట్టడం తమ మూడు 'నాన్-నెగోషియబుల్' డిమాండ్ల పై కాంగ్రెస్ పోరాటం చేస్తోంది.
