హైదరాబాద్, వెలుగు: వియత్నాంలోని హనోయ్ సిటీలో నిర్వహించిన 19వ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ ఒలింపియాడ్(ఐఓఏఏ–2026) పోటీల్లో నారాయణ ఇనిస్టిట్యూషన్స్ విద్యార్థులు అద్భుత కనబరిచారని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి. సింధూర నారాయణ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 64 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో నారాయణ విద్యార్థులు మూడు బంగారు పతకాలను గెలుచుకోవడం సంస్థకే కాకుండా యావత్ భారతదేశానికే గర్వకారణమని చెప్పారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నిరంతర సాధనతోనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు.
గత 47 ఏండ్లుగా అనుభవం, నైపుణ్యం పునాదులపై నిర్మితమైన నారాయణ ప్రత్యేక ఒలింపియాడ్ శిక్షణ విధానం విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థానాల్లో నిలబెడుతోందని ఆమె పేర్కొన్నారు. స్టూడెంట్లు సాధించిన ఈ ఘన విజయంపై నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు
