సందీప్ కిషన్ హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కొడుకు సంజయ్ జాసన్ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
వాస్తవానికి ఈ చిత్రాన్ని జులై 31న విడుదల చేయాలనుకున్నారు. కానీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. గాంధీ జయంతి సెలవుతో పాటు వీకెండ్, దసరా సీజన్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
