పవన్‌‌ కళ్యాణ్ అభినందనలు మర్చిపోలేను : అజయ్ అరసాడ

పవన్‌‌ కళ్యాణ్ అభినందనలు మర్చిపోలేను : అజయ్ అరసాడ

ఆయ్, సేవ్ ది టైగర్స్, వికటకవి, గుర్తుకొస్తున్నాయి లాంటి సినిమాలు, వెబ్‌‌ సిరీస్‌‌లతో సంగీత దర్శకుడిగా మెప్పించిన అజయ్ అరసాడ.. పదేళ్ల కెరీర్‌‌‌‌ పూర్తయిన సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ‘టీసీఎస్‌‌లో ఉద్యోగం చేస్తూ రెండు సినిమాలకు వర్క్‌‌ చేశా. దేవిశ్రీ ప్రసాద్‌‌ నాకు స్ఫూర్తి. శ్రీ చరణ్ నాకు మంచి ఫ్రెండ్. ఓ సంగీత దర్శకుడిగా అన్ని రకాల జానర్స్‌‌కు వర్క్‌‌ చేయాలని, నా దగ్గరకు వచ్చే ప్రతి కథకు న్యాయం చేయాలని చూస్తాను.  

ఇక సినిమాలతో పాటు జనసేన కార్యక్రమాలకు నేను మ్యూజిక్ ఇస్తుంటాను. ఆమధ్య పవన్ కళ్యాణ్​ గారు మోదీ గారిని కలిసినప్పుడు ఓ స్కోర్ చేశా. నా వర్క్ నచ్చడంతో పిలిపించి పర్సనల్‌‌గా అరగంట మాట్లాడి అభినందించడం మర్చిపోలేను.  పొలిటికల్‌‌గానే కాక  పీకే క్రియేటివ్స్ బ్యానర్‌‌‌‌లోనూ పని చేద్దామని ఆయన అన్నారు. ఈ పదేళ్ల కెరీర్‌‌ వల్ల ఎలాంటి పెద్ద కమర్షియల్ సినిమాకైనా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చగలను అనే కాన్ఫిడెన్స్‌‌ను సంపాదించుకున్నా.  సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పాడు.