మద్యం తాగడానికి, కార్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని కొట్టి, ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు...

మద్యం తాగడానికి, కార్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని కొట్టి, ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు...

మెదక్ జిల్లా నిజాంపేటలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు, కారు కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని కొట్టి, ఇంటికి నిప్పు పెట్టాడు కొడుకు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... 

నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన గౌతమ్ రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. ఓ రోజు మద్యం తాగేందుకు, కారు కొనేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లి రజినితో గొడవకు దిగాడు గౌతమ్ రెడ్డి. డబ్బులు ఇచ్చేందుకు తల్లి ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితంగా దాడి చేశాడు గౌతమ్ రెడ్డి.

గౌతమ్ రెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడింది తల్లి రజిని. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. తల్లి ఫిర్యాదు మేరకు గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.