బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3: ది కన్‌క్లూజన్' (Drishyam: The Conclusion) బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి రోజే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోయేలా చేసింది. సాధారణంగా యాక్షన్ సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ ఓ ఫ్యామిలీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌కు రావడమంటే మాటలు కాదు. కానీ విజయ్ సల్గాంకర్ మ్యాజిక్, అజయ్ దేవ్‌గన్ మాస్ ఫాలోయింగ్ కలిపి తొలిరోజే సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి.
గాంధీ జయంతి (అక్టోబర్ 2) కానుకగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 62 కోట్లకు పైగా నెట్ (రూ. 80.10 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ తో కలిపి వరల్డ్‌వైడ్‌గా మొదటిరోజే ఏకంగా రూ. 95.10 కోట్ల గ్రాస్ వసూళ్లతో దాదాపు వంద కోట్ల మార్కును తాకింది. మహారాష్ట్ర, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) సర్క్యూట్లలో చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులతో కెపాసిటీ చాలక ఆడియన్స్ ఇబ్బంది పడ్డారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ALSO READ : నన్ను ఆ సినిమాలో తీసుకోండి ప్లీజ్..
🚨 #DrishyamTheConclusion DAY 1 WORLDWIDE! 🔥
— Pan India Review (@PanIndiaReview) October 3, 2026
India Net: ₹66.75 Cr
India Gross: ₹80.10 Cr
Worldwide Gross: ₹95.10 Cr
A MONUMENTAL OPENING for the Ajay Devgn-led franchise 💥🔥
Officials might cross ₹100 CRORE WORLDWIDE 👀#Drishyam3 #AjayDevgn pic.twitter.com/j0WMkMkEpn
అజయ్ దేవ్‌గన్ కెరీర్‌లోనే 'సింగం అగైన్ '(రూ. 43.7 కోట్లు) రికార్డును అధిగమించి ఇది ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. అంతేకాదు, రణ్‌వీర్ సింగ్ 'ధురందర్', షారుఖ్ ఖాన్'జవాన్' చిత్రాల తర్వాతి స్థానంలో నిలిచి.. బాలీవుడ్ చరిత్రలోనే థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. పఠాన్, యానిమల్ సినిమాల డే-1 రికార్డులను సైతం 'దృశ్యం 3' సునాయాసంగా దాటేసింది.
డైరెక్టర్ అభిషేక్ పాఠక్ తెరకెక్కించిన ఈ చివరి భాగంలో అజయ్ దేవ్‌గన్‌తో పాటు టబు, శ్రియా శరణ్, జైదీప్ అహ్లావత్, ప్రకాష్ రాజ్ తమ నటనతో ప్రాణం పోశారు. పాజిటివ్ టాక్, మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ ఫ్రాంచైజ్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
