మహాదేవపూర్, వెలుగు: కాళేశ్వర క్షేత్ర ఆలయ కూల్చివేత పనులు పూర్తయ్యాయి. మంగళవారం పనుల్లో కీలకమైన గర్భగుడి నిర్మాణాన్ని నిపుణుల పర్యవేక్షణలో పూర్తిగా తొలగించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగానే పాత నిర్మాణాలను తొలగించారు. రూ. 198 కోట్లతో చేపట్టే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. పనులు ప్రారంభం కాగానే వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి రాతి కట్టడ నిర్మాణాలు పూర్తి అయ్యేలా ప్లాన్ రెడీ చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
