తిరుపతి శ్రీసిటీ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన కూటమి సర్కార్...

తిరుపతి శ్రీసిటీ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన కూటమి సర్కార్...

తిరుపతిలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలోని టిల్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికి ఐదుగురు మృతి చెందగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్ ప్రమదాంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

బాధితులకు తగిన సాయం అందించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో నిపుణుల కమిటీ ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తేలితే... భాద్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు అధికారులు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో బాయిలర్స్ ఇన్స్పెక్టర్ రాంబాబును సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. 

ALSO READ : ఉద్యోగానికి వెళ్తున్నాని చెప్పి ప్రియురాలితో సహజీవనం..

పరిశ్రమలకు సంబంధించి భద్రతా తనిఖీల్లో ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని అన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ ఘటనపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక సమర్పించి, తగిన చర్యలు చేపడతామని తెలిపారు కలెక్టర్.