హైదరాబాద్లో విషాద ఘటన.. ఓవర్ స్పీడ్ కారు బీభత్సం.. రోడ్డు క్రాస్ చేస్తూ స్పాట్లోనే బైకర్ మృతి

హైదరాబాద్లో విషాద ఘటన.. ఓవర్ స్పీడ్ కారు బీభత్సం.. రోడ్డు క్రాస్ చేస్తూ స్పాట్లోనే బైకర్ మృతి

కుత్బుల్లాపూర్: బౌరంపేట్‌ సుకృతి హోమ్స్ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. శంభీపూర్ నుంచి వెళ్తున్న మోటార్‌సైకిల్‌ను అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మల్లారెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతూ వెంకట్ రెడ్డి (38) మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని శంభీపూర్‌కు చెందిన సూపర్‌వైజర్ ఉదుతూరి వెంకట్ రెడ్డిగా గుర్తించారు.

కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. వెంకట్ రెడ్డి భార్య పద్మజ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. కారు అతి వేగంగా దూసుకురావడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్డు దాటేందుకు యత్నించిన వెంకట్ రెడ్డి కారు వచ్చే లోపు దాటేయొచ్చని భావించాడు. కానీ.. మితిమీరిన వేగంతో వచ్చిన కారు వెంకట్ రెడ్డి బైక్ను ఢీ కొట్టింది.

కారు ఓవర్ స్పీడ్తో ఢీ కొట్టడంతో ఈ ఘటనలో బైక్తో పాటు వెంకట్ రెడ్డి కూడా గాల్లోకి ఎగిరి దాదాపు పది మీటర్ల అవతల వెళ్లి పడ్డాడు. తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కారు ఓవర్ స్పీడ్ నిండు ప్రాణం తీసింది. పోలీసులు కారు డ్రైవ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.