రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్?

రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్?

ధురంధర్‌‌‌‌‌‌‌‌’ ఫ్రాంచైజీతో  ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌గా మారిపోయింది సారా అర్జున్.  ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తున్నా ఆచితూచి అడుగులేస్తోంది.  ఈ క్రమంలో టాలీవుడ్‌‌‌‌ నుంచి ఓ లక్కీ ఛాన్స్‌‌‌‌ ఆమెను వరించినట్టు సమాచారం.   రామ్ చరణ్‌‌‌‌ హీరోగా రూపొందబోయే చిత్రంలో ఆమె హీరోయిన్‌‌‌‌గా నటించబోతున్నట్టు టాక్.  ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న రామ్ చరణ్‌‌‌‌,  సుకుమార్ కాంబినేషన్‌‌‌‌లో మరో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

చరణ్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 17వ  చిత్రం. దసరాకు లాంఛనంగా ప్రారంభించి  నవంబర్‌‌‌‌‌‌‌‌ నుంచి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌కు ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌‌‌‌గా రష్మిక మందన్న,  కియారా అద్వాని,  కృతి సనన్ లాంటి పలువురు స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్స్‌‌‌‌ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.  అయితే వీళ్లందరినీ కాదని,  చరణ్‌‌‌‌కు జంటగా సారా అర్జున్‌‌‌‌ను తీసుకుంటున్నట్టు తాజా సమాచారం.  వచ్చే నెలలో వీళ్లిద్దరిపై ఫొటో షూట్ నిర్వహించి,  ఆ తర్వాత అఫీషియల్‌‌‌‌గా ఈ కాంబోను కన్ఫర్మ్‌‌‌‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక  చైల్డ్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌గా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సారా..  ‘ధురంధర్‌‌‌‌‌‌‌‌’ ఫ్రాంచైజీతో హీరోయిన్‌‌‌‌గా కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలోనే బ్యాక్ టు బ్యాక్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ బస్టర్స్‌‌‌‌ అందుకుంది.