నేటి (ఆగష్టు 19) నుంచి లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్

నేటి (ఆగష్టు 19) నుంచి లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: టీజీ లాసెట్ అడ్మిషన్ల రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 19 నుంచి 22 వరకు మొదటి విడతలో రిజిస్టర్ చేసుకోని అభ్యర్థులు ఆన్‌లైన్ పేమెంట్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ ప్రక్రియను పూర్తి చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ పాండురంగారెడ్డి సూచించారు.

అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, 26న ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 29న కాలేజీల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతామని, సీట్లు పొందిన వారు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5 లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజు రశీదుతో సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని చెప్పారు.