అలనాటి రాముడు.. నేటి దశరథుడు 

అలనాటి రాముడు.. నేటి దశరథుడు 

రామానంద్ సాగర్ తెరకెక్కించిన ఐకానిక్ టీవీ సీరియల్ ‘రామాయణ్’లో శ్రీరాముడిగా నటించి కోట్లాది భారతీయ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోవిల్. ఇన్నేళ్ల తర్వాత ఆయన మళ్లీ రామాయణ కథలోకి వచ్చారు.  అయితే ఈసారి రాముడిగా కాదు.. రాముడి తండ్రి దశరథుడిగా. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంలో ఆయన దశరథుడి పాత్రను పోషిస్తున్నారు. 

ఇందుకు సంబంధించిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం విడుదల చేశారు. ‘‘ఒక తరం కోసం రాముడి పాత్రకు ప్రాణం పోసిన ఆయన ఇప్పుడు ‘రామాయణ’ ప్రపంచంలోకి అయోధ్య రాజుగా తిరిగి వస్తున్నారు” అంటూ మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను షేర్ చేశారు.  

రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. హీరో యశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  డీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈజీ సంస్థతో కలిసి నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 5న పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానుంది.