భారత ఐటీ సంస్థలకు అమెరికా షాకిచ్చింది. గ్రీన్ కార్డు ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఐటీ కంపెనీలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, క్యాప్ జెమినీ, హెచ్సీఎల్ వంటి ఐటీ దిగ్గజాలను PERM కార్యక్రమం నుంచి సస్పెండ్ చేశారు. అంటే ఈ కంపెనీలు ఇక నుంచి గ్రీన్ కార్డు సర్టిఫికేషన్ ఇవ్వకుండా సస్పెండ్ చేసింది. 2026 అక్టోబర్ 8న తీసుకున్న ఈ నిర్ణయం గ్రీన్ కార్డు కోసం చూస్తున్న వేలాది మంది భారతీయులపై పడనుంది. H-1B వీసా దుర్వినియోగంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.
ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ పై విరుచుకుపడ్డారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యా్న్స్. అమెరికా ఉద్యోగులను వేల సంఖ్యలో మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ చేసిందని ఆరోపించారు. అదే సమయంలో H-1B ఆధారంగా వచ్చిన వేల మందికి మేలు చేసినట్లు ఆరోపించారు. వీసా సంబంధిత కార్యకలాపాలను దుర్వినియోగం చేసిన ఆరోపణలతో 9 యూనివర్సిటీలను విచారలో ఉంచినట్లు తెలుస్తోంది.
PERM కార్యక్రమం నుంచి మైక్రోసాఫ్ట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన వాన్స్ , ఆ సంస్థ 6 వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని, అదే సమయంలో 6 వేల 300 H-1B వీసాలు, దాదాపు 3వేల గ్రీన్ కార్డ్‌ల ద్వారా ప్రయోజనం పొందిందని అన్నారు. దురదృష్టవశాత్తు, యునైటెడ్ స్టేట్స్‌లో మైక్రోసాఫ్ట్ కంటే ఎక్కువగా ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసిన కంపెనీ మరొకటి లేదని వాన్స్ అన్నారు.
మైక్రోసాఫ్ట్ తొలగించిన ప్రతి ఉద్యోగి స్థానంలో దాదాపు విదేశీ కార్మికులను నియమించుకుందని వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో వాన్స్ అన్నారు.
PERM, అనేది అమెరికాలోని కంపెనీల యజమానులు విదేశీ కార్మికులను శాశ్వతంగా నియమించుకోవడానికి ధృవీకరణ కోరేందుకు వీలు కల్పించే ఒక కార్మిక శాఖ ప్రక్రియ.
.@Sonderling47: "I am hereby suspending from the Permanent Labor Certification Program some of the largest IT outsourcing firms in the world — Cognizant, Infosys, Tata, Wipro, HCL, and Capgemini — and also, due to multiple active federal investigations, @USDOL is suspending Microsoft and Adobe from the program."
— Rapid Response 47 (@RapidResponse47) October 8, 2026
