వనపర్తి జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ, వనపర్తి (డీఎంహెచ్ఓ, వనపర్తి) స్టాఫ్ నర్స్, ఏఎన్‌ఎం, తదితర మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 30న ప్రారంభం కాగా, అక్టోబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 27.
విభాగాల వారీగా ఖాళీలు: పీడియాట్రీషియన్ / మెడికల్ ఆఫీసర్ 3, స్టాఫ్ నర్స్ 9, 2వ ఏఎన్ఎం 2, ల్యాబ్ టెక్నీషియన్ 3, అనస్తీటిస్ట్ 1, ఓబీజీ స్పెషలిస్ట్ 1, ఎంఎల్‌హెచ్‌పీ/ సీహెచ్ఓ/ ఎంఓ–- పల్లె దవాఖాన 6, ఫిజీషియన్ / ఎంబీబీఎస్ / ఎండీ 1, ఏఎన్ఎం 1.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు పీడియాట్రిక్స్‌లో ఎండీ/ డీఎన్‌బీ/ డిప్లొమా, జీఎన్‌ఎం లేదా బీఎస్సీ నర్సింగ్, ఏఎన్‌ఎం / ఎంపీహెచ్‌డబ్ల్యూ (మహిళా), డీఎంఎల్‌టీ లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఎంఎల్‌హెచ్‌పీ/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ కమ్యూనిటీ హెల్త్ పూర్తిచేసి ఉండాలి. జనరల్ మెడిసిన్/ ఫ్యామిలీ మెడిసిన్‌లో ఎండీ/ డీఎన్‌బీ ఉండాలి.
ఎంబీబీఎస్‌తోపాటు అనస్తీషియాలజీలో ఎండీ/ డీఎన్‌బీ లేదా పీజీ డిప్లొమా, తగిన మెడికల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్‌తోపాటు అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ లేదా సమాన పీజీ డిప్లొమా, వాలిడ్ మెడికల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
►ALSO READ | సుప్రీంకోర్టులో.. 250 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులు
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 30.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీలు రూ.200, ఇతర అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 9.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్ష, వయసు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత పరీక్షకు 90 మార్కులు, వయసుకు 10 మార్కులు కేటాయిచారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ wanaparthy.telangana.gov.inను సందర్శించండి.
