సుప్రీంకోర్టులో.. 250 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులు

సుప్రీంకోర్టులో.. 250 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులు
  • 250 ఖాళీలతో సుప్రీంకోర్టు నోటిఫికేషన్

సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్–-బి నాన్–-గెజిటెడ్ కేటగిరీకి కింద 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 7న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు: జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (గ్రూప్ – బి, నాన్– గెజిటెడ్, లెవల్ 6)
మొత్తం ఖాళీలు: 250.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
అభ్యర్థులకు కంప్యూటర్ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌పై అవగాహన ఉండాలి. అలాగే, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌పై నిమిషానికి 35 పదాల (డబ్ల్యూ.పీ.ఎం) వేగంతో టైపింగ్ చేయగల సామర్థ్యం తప్పనిసరి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అభ్యర్థులు 
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ విధిగా సమర్పించాలి.
వయసు: 2026, సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 7.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఎక్స్ సర్వీస్ మెన్/ పీడబ్ల్యూబీడీలు రూ. 750, ఇతరులు రూ.1500 చెల్లించాలి. 
లాస్ట్ డేట్: అక్టోబర్ 10. 
ఆబ్జెక్టివ్ రాత పరీక్ష: నవంబర్ 20 (తాత్కాలిక).
ఆన్సర్ కీ అప్​లోడ్: నవంబర్ 22. 
సెలెక్షన్ ప్రాసెస్: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, రాత పరీక్ష (వ్యాసరూప) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.sci.gov.inను సందర్శించండి.

ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షా విధానం

మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉన్నది.  ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
జనరల్ ఇంగ్లిష్ నుంచి20 ప్రశ్నలు 20 మార్కులకు, జనరల్ ఆప్టిట్యూడ్ (అర్థమెటిక్/ రీజనింగ్) నుంచి15 ప్రశ్నలు 15 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, భారత రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థకు సంబంధించిన నిబంధనల నుంచి15 ప్రశ్నలు 15 మార్కులకు, సుప్రీంకోర్టు రూల్స్–2013 నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు, సుప్రీంకోర్టు అధికారులు, సిబ్బంది (సర్వీస్ నిబంధనలు & ప్రవర్తన నియమాలు–1961) నుంచి10 ప్రశ్నలు 10 మార్కులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు ఇస్తారు. 

టైపింగ్ స్పీడ్ టెస్ట్ 

కంప్యూటర్‌‌‌‌‌‌‌‌పై నిర్వహించే టైపింగ్ స్పీడ్ టెస్టులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ రాత పరీక్ష పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. టైప్ చేసిన మొత్తం పదాల్లో గరిష్టంగా 3 శాతం తప్పులను మాత్రమే అనుమతిస్తారు.
డిస్క్రిప్టివ్ రాత పరీక్ష
ఇంగ్లిష్ భాషలో నిర్వహించే డిస్క్రిప్టివ్ రాత పరీక్షలో కాంప్రహెన్షన్ ప్యాసెజ్, ప్రెసిస్ రైటింగ్, వ్యాస రచన అంశాలు ఉంటాయి.