Healthy Food: కొత్తిమీర పొంగల్.. బీపీ.. షుగర్.. లివర్.. కిడ్నీ సమస్యలకు మంచి మందు.. ఎలా తయారు చేయాలంటే..!

Healthy Food: కొత్తిమీర పొంగల్.. బీపీ.. షుగర్.. లివర్.. కిడ్నీ సమస్యలకు మంచి మందు.. ఎలా తయారు చేయాలంటే..!

తెలుగువారు చాలామంది  పండుగ వచ్చినా.. పబ్బం వచ్చినా.. పిండి వంటకాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.  స్వీట్​ ప్రియులైతే పొంగల్​.. హాట్​ ప్రియులైతే పులిహార అంటే లొట్టలేస్తారు.  ఎప్పుడూ రొటీన్​ గా చేసే బియ్యం..సగ్గుబియ్యం.. సేమ్యా పొంగల్​ అంటే బోర్​ కొడుతుంది కదా.. అలా కాకుండా వెరైటీగా కొత్తిమీరతో పొంగల్​ చేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా..  కడుపులో పేరుకుపోయిన చెత్తను ఇట్టే తొలగించేస్తుంది. అలాంటి హెల్దీ పొంగల్​ ను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.  కొత్తిమీర పొంగల్​ ను ఎలా తయారు చేయాలి..ఏమేమి కావాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

కొత్తిమీర పొంగలి తయారీకి కావాల్సినవి

  •  బియ్యం-అరకప్పు
  • పెసర పప్పు- అర కప్పు 
  • కొత్తిమీర- కప్పు
  •  కరివేపాకు- మూడు రెబ్బలు 
  • పచ్చిమిర్చి- మూడు
  •  నీళ్లు- మూడు కప్పులు 
  • పసుపు ఉప్పు- టీస్పూన్‌ 
  • నెయ్యి- పావు కప్పు 
  • జీడిపప్పులు- పావు కప్పు
  •  మిరియాలు- టీస్పూన్‌ 
  • జీలకర్ర- టీస్పూన్‌ 
  • తరిగిన అల్లం- టీస్పూన్‌ 
  • ఇంగువ- కొద్దిగా
  •  కరివేపాకు- రెండు రెబ్బలు

 కొత్తిమీర పొంగల్‌ తయారీ విధానం 

బియ్యం, పెసరపప్పును శుభ్రంగా కడిగి విడివిడిగా నీళ్లలో గంటసేపు నానబెట్టాలి.  ఇప్పుడు కొత్తిమీర, కనివేపాకును శుభ్రంగా కడిగా ఆకులను కట్​ చేయాలి. ఆ తరువాత పచ్చి మిర్చిని  ఒక్కొక్క మిర్చిని రెండు ముక్కలు చేయాలి.  ఈ మూడింటిని ( కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి) మిక్సీ జార్​ లో మెత్తగా పేస్ట్​ చేయాలి. 

ఇప్పుడు స్ట్​ వెలిగించి.. కుక్కర్​ లో బియ్యం, పెసరపప్పు వేసి  అన్నం ఉడికేలా నీళ్లు పోయాలి.  ఇందులో పసుపు ఉప్పు, నెయ్యి వేసి  నాలుగు విజిల్స్​ వచ్చేలా ఉడికించుకోవాలి.  విజిల్​ ఆవిరి పోయిన పోయిన తరువాత ఉడికిన మిశ్రమాన్ని గరిటతో బాగా కలియబెట్టాలి.  ఈ మిశ్రమం గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నీళ్లు పోసి కలిబెట్టాలి. 

ఇప్పుడు స్టవ్​పై మూకుడును వేడి చేయాలి.  అందులో కొద్దిగా నెయ్యుని కాగనివ్వాలి.  అందులో మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి వేయించాలి. ఆ తరువాత అల్లం ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసి  పోపు పెట్టాలి.  ఈ తాలిపును బియ్యం.. పెసరపప్పు ఉడికిన పొంగల్​ లో కలపాలి.  

ఇందులో పైన తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్​ను కలుపుకోవాలి. ఒక అంతే హెల్దీ అండ్​ టేస్తీ కొత్తిమీర పొంగల్​ రడీ.  బ్రేక్​ ఫాస్ట్​ గా కొత్తిమీర పొంగల్​ ను  బీపీ.. షుగర్​తో పాటు బాధపడే వారు.. చెడు కోలెస్ట్రాల్​ ఉన్నవారు తింటే  ఈ సమస్యలు అదుపులో ఉంటాయి. కడుపులో వ్యర్ధాలు తొలగిపోవడమే కాకుండా.. లివర్​, కిడ్నీ లు కూడా సక్రమంగా పని చేస్తాయి.