గ్రీన్ కార్డ్ ప్రోగ్రాం నుంచి సస్పెండ్.. టాటా, విప్రో, HCL, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, అడాబ్లకు అమెరికా ఊహించని షాక్

గ్రీన్ కార్డ్ ప్రోగ్రాం నుంచి సస్పెండ్.. టాటా, విప్రో, HCL, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, అడాబ్లకు అమెరికా ఊహించని షాక్

హెచ్1బీ దుర్వినియోగాన్ని కారణంగా చూపుతూ టెక్ రంగంలో దిగ్గజ సంస్థలైన టాటా, విప్రో, HCL, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, అడాబ్లకు అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సంస్థలకు పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ఫైలింగ్స్ను నిలిపివేస్తూ, గ్రీన్ కార్డ్ ప్రోగ్రాం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ నిర్ణయం కారణంగా ఇకపై ఈ సంస్థల ఉద్యోగులు గ్రీన్ కార్డ్ పొందడం అంత సులువు కాదు.

వీసా వ్యవస్థను సదరు ఐటీ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. "దురదృష్టవశాత్తు, యునైటెడ్ స్టేట్స్‌లో మైక్రోసాఫ్ట్ కంటే ఎక్కువగా ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసిన కంపెనీ మరొకటి లేదు," అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వాషింగ్టన్‌లో వ్యాఖ్యానించారు.

మైక్రోసాఫ్ట్ ఒక గొప్ప అమెరికన్ కంపెనీ అని చెబుతూనే తోటి అమెరికన్లకు ఉపాధి కల్పించి, వారిని శక్తివంతంగా తీర్చిదిద్దాలని జేడీ వాన్స్ పిలుపునిచ్చారు. ఉద్యోగ వీసా వ్యవస్థను ఈ కంపెనీలు దుర్వనియోగం చేస్తున్నాయని, అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటాయని యూఎస్ కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఆరోపించారు.

మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ను జేడీ వాన్స్ ప్రస్తావించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ 2025లో 6 వేల మంది అమెరికా ఉద్యోగులను తొలగించిందని ఆయన చెప్పారు. మైక్రోసాఫ్ట్ హెచ్-1బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించారు.