హైదరాబాద్ DRDOలో ఉద్యోగాలు:అప్లై చేయడానికి అర్హతలు, పూర్తి వివరాలు ఇవే!

హైదరాబాద్ DRDOలో ఉద్యోగాలు:అప్లై చేయడానికి అర్హతలు, పూర్తి వివరాలు ఇవే!

హైదరాబాద్‌లోని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఆర్​డీఓ డీఎంఆర్ఎల్) ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.

మొత్తం ఖాళీలు: 18.

విభాగాల వారీగా ఖాళీలు: మెటలర్జికల్ ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ 7, మెకానికల్ ఇంజినీరింగ్ 7, కెమికల్ ఇంజినీరింగ్ 2, ఫిజిక్స్ 2.

విద్యార్హతలు
 మెటలర్జికల్ ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్: మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్, మెటీరియల్స్ ఇంజినీరింగ్ లేదా మెటీరియల్స్ టెక్నాలజీ విభాగాల్లో ఫస్ట్ క్లాస్‌తో బీఈ లేదా బి.టెక్ పూర్తిచేసి, వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి. లేదా ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.

మెకానికల్ ఇంజినీరింగ్:  మెకానికల్ ఇంజినీరింగ్  విభాగంలో ఫస్ట్ క్లాస్‌తో బీఈ లేదా బి.టెక్ పూర్తిచేసి, వ్యాలిడ్ గేట్ స్కోర్  కలిగి ఉండాలి. లేదా ఎంఈ లేదా ఎం.టెక్  పూర్తిచేసి ఉండాలి.

కెమికల్ ఇంజినీరింగ్:  కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ క్లాస్‌తో బీఈ లేదా బి.టెక్  పూర్తిచేసి, వ్యాలిడ్ గేట్ స్కోర్  కలిగి ఉండాలి.  లేదా ఎంఈ లేదా ఎంటెక్  పూర్తిచేసి ఉండాలి.

ఫిజిక్స్: ఫిజిక్స్ విభాగంలో ఫస్ట్ డివిజన్​తో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు వ్యాలిడ్ నెట్  క్వాలిఫికేషన్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 6.

లాస్ట్ డేట్: అక్టోబర్ 27.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.drdo.gov.inను సందర్శించండి.