గడచిన కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు తమ ర్యాలీని నెమ్మదింపచేశాయి. అంతర్జాతీయంగా వస్తున్న ఆర్థిక మార్పులే దీనికి కారణఁ అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు, ఈ క్రమంలో దసరా, దీపావళికి షాపింగ్ చేయాలని ప్రలాన్ చేసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రేట్లను పరిశీలించటం బెటర్. ఈ క్రమంలో గోల్డ్ అండ్ సిల్వర్ బ్రేక్ సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్న వారికి ఇదే సరైన అవకాశం.
అక్టోబర్ 8న బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 957గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 710గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 8, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.
