యంగ్‌గా, హెల్దీగా ఉండాలా ? రోజూ తినాల్సిన 10 సూపర్ ఫ్రూట్స్ ఇవే!

యంగ్‌గా, హెల్దీగా ఉండాలా ? రోజూ తినాల్సిన 10 సూపర్ ఫ్రూట్స్ ఇవే!

మన శరీరంలో వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా, అలాగే  రోగాలు రాకుండా కాపాడే ‘బాడీగార్డ్స్’ లాంటివే ఈ యాంటీఆక్సిడెంట్లు. ఇవి శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. మార్కెట్లో లభించే సప్లిమెంట్ టాబ్లెట్ల కంటే తాజా పండ్ల ద్వారానే ఇవి మనకు సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు నిండిన పండ్లను రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది.. గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి.. చర్మం కాంతివంతంగా మారుతుంది.. శరీరంలో వాపులు  తగ్గుతాయి.

మీరు తినే రోజు ఆహారంలో కనీసం 3 రకాల పండ్లను చేర్చుకోవడం మంచిది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్న 10 పండ్లు, వాటిని ఎలా తినాలో ఇప్పుడు చూద్దాం:

1. బ్లూబెర్రీలు 
దీనిలో ఆంథోసయనిన్లు, విటమిన్ సి, మాంగనీస్ పోషకాలు ఉంటాయి. ఇవి నాడీ కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి, బీపీ తగ్గిస్తాయి ఇంకా శరీరంలో వాపులను నయం చేస్తాయి. ఎలా తినాలంటే.. ఓట్‌మీల్‌లో కలుపుకొని, స్మూతీస్ (Smoothies) చేసి లేదా కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లటి స్నాక్‌గా తినవచ్చు.

2. స్ట్రాబెర్రీలు 
దీనిలో  విటమిన్ సి, ఎలాజిక్ యాసిడ్, ఫ్లేవనోల్స్ వంటి పోషకాలు ఉంటాయి. కొన్ని రకాల నారింజ పండ్ల కంటే వీటిలోనే విటమిన్ సి ఎక్కువ. ఇవి చర్మ సౌందర్యానికి (కొల్లాజెన్ పెరగడానికి) సహాయపడతాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి, బ్లడ్ షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా చూస్తాయి. దీనిని ఎలా తినాలంటే పెరుగుతో (Yogurt) కలిపి, సలాడ్లలో వేసుకొని లేదా డార్క్ చాక్లెట్‌లో ముంచి రుచికరమైన డెజర్ట్‌గా తినవచ్చు.

3. రాస్ప్‌బెర్రీస్ 
దీనిలో ఆంథోసయనిన్లు, ఎలాజిటానిన్లు, ఫైబర్ (పీచు పదార్థం) పోషకాలు ఉంటాయి. వీటిలోని అధిక పీచు పదార్థం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్ నివారణకు ఎంతగానో తోడ్పడతాయి. దీనిని  ఉదయాన్నే తినే సిరియల్స్ (Cereals) లో వేసుకొని లేదా ఫ్రీజ్ చేసి ఐస్ పాప్స్‌లా తినవచ్చు.

4. దానిమ్మ  
దీనిలో పునికలాగిన్స్, విటమిన్ సి, పాలిఫెనాల్స్ పోషకాలు ఉంటాయి. పండ్లలోకెల్లా అత్యధిక యాంటీఆక్సిడెంట్ లెవల్స్ దానిమ్మలోనే ఉంటాయి.  ఇవి రక్తనాళాల్లో కొవ్వు (Plaque) చేరుకోకుండా చూస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఇంకా చర్మాన్ని ఎండ (UV) దెబ్బల నుండి కాపాడతాయి. దానిమ్మ గింజలను సలాడ్‌పై చల్లుకొని, స్మూతీస్‌లో కలుపుకొని లేదా తాజా జ్యూస్‌లా తాగవచ్చు.

5. గోజీ బెర్రీలు 
దీనిలో జీక్సాంథిన్, పాలిసాకరైడ్లు, విటమిన్ ఎ పోషకాలు ఉన్నాయి. వీటిలోని జీక్సాంథిన్ కంటి చూపుకు చాలా మంచిది. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, బ్లడ్ షుగర్‌ను కంట్రోల్లో ఉంచుతాయి. ఎండు గోజీ బెర్రీలను నీటిలో నానబెట్టి తినవచ్చు లేదా గ్రానోలా/స్మూతీస్‌పై చల్లుకోవచ్చు.

6. చెర్రీలు  
దీనిలో ఆంథోసయనిన్లు, మెలటోనిన్, విటమిన్ సి పోషకాలు ఉంటాయి.  వీటిలో సహజ సిద్ధమైన ‘మెలటోనిన్’ ఉండటం వల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులను ఇవి తగ్గిస్తాయి. తాజాగా నేరుగా తినవచ్చు, బేకింగ్ వంటకాల్లో లేదా వ్యాయామం తర్వాత చెర్రీ జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

7. కివి  
దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ, ల్యూటిన్, పాలిఫెనాల్స్ పోషకాలు ఉంటాయి.  నారింజ పండ్ల కంటే కివీలో రెండింతలు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. జీర్ణక్రియను వేగవంతం చేసే ‘యాక్టినిడిన్’ అనే ఎంజైమ్ ఇందులో ఉంటుంది. చర్మం, కళ్లు, గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. దీనిని ముక్కలుగా కోసి పండ్ల సలాడ్‌లో వేసుకోవచ్చు, స్కూప్‌తో లోపలి గుజ్జును నేరుగా తినవచ్చు.

8. ఎరుపు & ఊదా ద్రాక్ష  
దీనిలో రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్, ఆంథోసయనిన్లు పోషకాలు ఉంటాయి. వీటిలోని ‘రెస్వెరాట్రాల్’ శరీరానికి దీర్ఘాయువును, నవయౌవనాన్ని ఇస్తుంది. గుండె పనితీరును మెరుగుపరిచి షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది.వీటిని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా తీపి స్నాక్‌లా తినవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్లలో కలపవచ్చు.

9. నారింజ & సిట్రస్ పండ్లు  
దీనిలో విటమిన్ సి, ఫ్లేవనోన్స్, బీటా-క్రిప్టోక్సాంథిన్ పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇనుము (Iron) శోషణను పెంచుతాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ఇంకా చర్మం త్వరగా వృద్ధాప్యానికి గురికాకుండా కాపాడతాయి. దీనిని తాజా జ్యూస్ తాగావచ్చు లేదా నీటిలో నిమ్మ/నారింజ ముక్కలు వేసి డిటాక్స్ వాటర్‌లా తీసుకోవచ్చు.

10. అవకాడో  
దీనిలో విటమిన్ ఇ, ల్యూటిన్, మంచి కొవ్వులు పోషకాలు ఉంటాయి. అవకాడోలో ఉండే మంచి కొవ్వులు ఇతర యాంటీఆక్సిడెంట్లను శరీరం త్వరగా పీల్చుకునేలా చేస్తాయి. ఇవి మెదడు చురుగ్గా పనిచేయడానికి, చర్మంలో తేమ పెరగడానికి దోహదపడతాయి. గువాకామోల్ (Guacamole) డిప్‌గా చేసి, బ్రెడ్ టోస్ట్‌పై రాసుకొని లేదా స్మూతీస్‌లో కలిపి తీసుకోవచ్చు.

 ప్రకృతి ప్రసాదించిన ఈ 10 రకాల పండ్లను మీ రోజు  ఆహారంలో చేర్చుకోవడం ద్వారా  వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ప్రతిరోజూ కనీసం 3 రకాల పండ్లను (తాజాగా గానీ, జ్యూస్ లేదా స్మూతీ రూపంలో గానీ) తినడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందండి.