బాలీవుడ్‌లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం సినిమాల కంటే కోర్టు కేసులతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చెక్ బౌన్స్ కేసుల్లో చిక్కుకున్న ఆయనకు తాజాగా సుప్రీంకోర్టు ఊహించని సలహా ఇచ్చింది. ‘‘మంచి సినిమా తీయండి.. మళ్లీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయండి.. మీ ఇమేజ్‌ను తిరిగి బిల్డ్ చేసుకోండి’’ అంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. అంతేకాకుండా ‘‘మా దగ్గర కూడా మంచి నటులైన లాయర్లు ఉన్నారు. వాళ్లతో ఓ సినిమా తీయొచ్చు కదా’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం CJI ఇచ్చిన ఈ ఆసక్తికర సలహా సినీ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్గా మారింది.
రాజ్‌పాల్ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి..
చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి రాజ్‌పాల్ యాదవ్ ఇప్పటికే రూ.1.15 కోట్లు చెల్లించారు. తన పూర్వీకుల ఆస్తిని విక్రయించి మరికొంత మొత్తాన్ని చెల్లించేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాదులు.. ఆస్తిని కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చారని, అక్టోబర్ 12లోగా రూ.85 లక్షలు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే, రాజ్‌పాల్ యాదవ్ వ్యవహారశైలిపై తాము సంతృప్తిగా లేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయనకు కేవలం కొంత సమయం మాత్రమే ఇస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
‘రూ.200-250 కోట్ల వరకు నష్టపోయాను’: రాజ్‌పాల్
కోర్టుకు స్వయంగా హాజరైన రాజ్‌పాల్ యాదవ్.. తన పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు 200 నుంచి 250 సినిమాల్లో నటించానని, గత 13 ఏళ్లలో దాదాపు రూ.200-250 కోట్ల వరకు నష్టపోయానని తెలిపారు. తాను దర్శకత్వం వహించిన ‘అటా పటా లాపటా’ సినిమా తనకు తీవ్ర నష్టాలను మిగిల్చిందని చెప్పారు. దాదాపు రూ.17 కోట్లు ఈ సినిమా వల్ల నష్టపోయానని, సినిమా 1,200 థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. చివరకు ఒక్క థియేటర్‌లో కూడా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా సినిమాపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సినిమా ఆగిపోయింది. నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయాను’’ అంటూ రాజ్‌పాల్ యాదవ్ కోర్టులో తన పరిస్థితిని వివరించారు.
WHEN THE COURTROOM SPEAKS BEYOND LAW When CJI Surya Kant reportedly told Rajpal Yadav, “Koi nayi movie banao,” the moment instantly travelled beyond the courtroom. But beneath the humour lies a harder truth: a court case may involve a celebrity, but justice cannot become celebrity theatre. The Bench may speak lightly. The law must still speak precisely. A courtroom can smile—but its final language must always be law, reason and due process. Because in a constitutional court, personality may create the headline; principle must decide the case. #RajpalYadav #CJISuryaKant #SupremeCourt #SupremeCourtOfIndia #RuleOfLaw #DueProcess #Constitution #LegalNews #Courtroom #NKGoswami
— Narendra Goswami (@NarendraGoswami) October 7, 2026
‘మళ్లీ సినిమా చేయండి’.. కోర్టు సలహా
రాజ్‌పాల్ యాదవ్ మాటలు విన్న తర్వాత చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘కొత్త సినిమా ఏదైనా వస్తుందా? మంచి సినిమా తీసి మళ్లీ ప్రజలను ఎంటర్‌టైన్ చేయండి. అలా చేస్తే మీ ఇమేజ్ మళ్లీ బిల్డ్ అవుతుంది’’ అని అన్నారు. అంతేకాదు.. మా దగ్గర కూడా మంచి నటులైన న్యాయవాదులు ఉన్నారు. వాళ్లతో ఓ సినిమా తీయొచ్చు కదా అని సరదాగా సూచించారు. దీంతో సుప్రీంకోర్టులో జరిగిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారాయి.
అసలు కేసు ఏంటి?
రాజ్‌పాల్ యాదవ్ దర్శకత్వం వహించిన ‘అటా పటా లాపటా’ సినిమా కోసం 2010లో మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం తీసుకున్నట్లు కేసు వివరాలు చెబుతున్నాయి. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు 2013లో ఏడు చెక్కులు ఇచ్చారని, ఒక్కో చెక్కు విలువ రూ.1.05 కోట్లు అని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అయితే ఆ చెక్కులు బౌన్స్ కావడంతో వివాదం కోర్టుకు చేరింది. ఈ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది జూలైలో రాజ్‌పాల్ యాదవ్‌కు మూడు నెలల జైలు శిక్ష విధించింది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో విచారణ కొనసాగుతోంది.
ఇక ఒకవైపు కోర్టు కేసులు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన ‘‘మంచి సినిమా తీయండి.. ప్రేక్షకులను మళ్లీ నవ్వించండి.. మీ ఇమేజ్‌ను తిరిగి నిర్మించుకోండి’’ అనే సలహా మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
