Weekend New Movies: ఒకే రోజు థియేటర్లలోకి 7 కొత్త సినిమాలు.. శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' టూ 'హనుమాన్ అంశ్' వరకు పూర్తి లైనప్!

Weekend New Movies: ఒకే రోజు థియేటర్లలోకి 7 కొత్త సినిమాలు.. శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' టూ 'హనుమాన్ అంశ్' వరకు పూర్తి లైనప్!

గత వారం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 11 చిత్రాలు థియేటర్లలోకి వచ్చి పోటీపడినా.. కమర్షియల్ గా ప్రేక్షకులను మాత్రం మెప్పించలేక పోయాయి.  బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో ఇప్పుడు ఈ అక్టోబర్ సెంకర్ వీకెండ్ పైనే సినీ ప్రియులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అనుకోకుండా విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఆదర్శ కుటుంబం' రేసు నుండి తప్పించుకున్నప్పటికీ.. ఈ శుక్రవారం ( అక్టోబర్ 9, 2026 ) ఏకంగా 7 కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాయి.

రేసులో శ్రీవిష్ణు నక్సలైట్ డ్రామా..

ఈ వారం వస్తున్న చిత్రాలలో అత్యంత క్రేజ్ ఉన్న చిత్రం వర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు నటించిన 'కామ్రేడ్ కళ్యాణ్'. 1990ల ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ వినోదాత్మక చిత్రంలో శ్రీవిష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతుంది.  ఈ మూవీలో రాధిక, షైన్ టామ్ చాకో, సత్య కీలక పాత్రల్లో నటించారు. జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.

 

క్రైమ్ కామెడీ To హర్రర్ థ్రిల్లర్స్ వరకు..

మేఘాలయ అందాల నేపథ్యంలో తెరకెక్కిన న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం 'బా... బా.. బ్లాక్ షీప్'.  కొత్త కాన్సెస్ట్ తో వస్తున్న ఈ మూవీలో ఉపేంద్ర లిమాయే, టీనూ ఆనంద్, రాజా రవీంద్ర, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహించారు.

 

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో, బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్ నటించిన సీట్-ఎడ్జ్ థ్రిల్లర్ 'మయూఖ' శశిధర్ నల్లా నిర్మాణంలో శ్రీతేజ్ ఎస్.కె దర్శకత్వం వహించారు. హాలీవుడ్, కొరియన్ సినిమాల స్థాయి విజువల్స్, సీజీ వర్క్‌తో సినిమా ఉంటుందని దర్శకుడు శ్రీతేజ్ ఎస్‌కే చెబుతున్నారు. ఇక శ్రవణ్, మలైకా జంటగా మంగా శ్రీనివాస్ తెరకెక్కించిన మ్యూజికల్ లవ్ స్టోరీ 'చకోర'. అలాగే అల్వాల్ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'గుడ్ టైమ్' కూడా ఈ వారమే రాబోతున్నాయి.

రెండు ఆసక్తికర చిత్రాలు..

స్ట్రెయిట్ సినిమాలతో పాటు తమిళం నుండి సూరి, అంజలి నటించిన 'సప్త సాగరాలు సప్త గిరులు' తెలుగులోకి వస్తోంది. ఇక హిందీలో సంచలన విజయం సాధించిన.. నీమ్ కరోలీ బాబా జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం 'హనుమాన్ అంశ్' తెలుగులో విడుదల అవుతోంది.  హోంబలే ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా గ్రాండ్‌గా తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టంది.

 

మొత్తంగా.. ఐదు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్ చిత్రాలతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ బరిలో ఏడు సినిమాలు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా.. కొత్త కాన్సెప్టులు, థ్రిల్లర్లు, క్రైమ్ కామెడీ, లవ్‌స్టోరీ, డివోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ వారం థియేటర్లలో వైవిధ్యమైన కంటెంట్ కనిపించబోతోంది. మరి ఈ ఏడు సినిమాలు ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి.