జనవరి శ్రీవారి సేవ కోటా విడుదల.. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ బుకింగ్

జనవరి శ్రీవారి సేవ కోటా విడుదల.. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ బుకింగ్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం విడుదల అందించింది. 2027 జనవరి నెలలో శ్రీవారి సేవ చేయాలనుకునే వారి కోసం ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించనుంది. నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ టికెట్లను విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో సేవ చేయాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

సేవకు ఎంపికైన వారు ఎప్పుడు వెళ్లాలంటే..

జనరల్ శ్రీవారి సేవకు బుక్ చేసుకున్నవారు తమ సేవ ప్రారంభమయ్యే రోజే తిరుమల లేదా తిరుపతిలో రిపోర్ట్ చేయాలి. పరకామణి సేవకు బుక్ చేసుకున్నవారు మాత్రం తమ సేవ తేదీకి ఒక రోజు ముందుగానే తిరుమలకు వెళ్లాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అక్కడ రిపోర్ట్ చేయాలి.

ముందుగానే ప్రొఫైల్ నమోదు..

సేవ బుకింగ్ కోసం భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌లో ముందుగానే తమ వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. బుకింగ్ సమయంలో ఇబ్బంది లేకుండా ముందే ఈ పని పూర్తి చేసుకోవడం మంచిది.

శ్రీవారి సేవకు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని టీటీడీ భక్తులను కోరింది.