ముంబై: మిల్కీ మిస్ట్ డెయిరీ ఐపీఓ హిట్టయింది. తొలిరోజైన మంగళవారం షేర్లు మార్కెట్లో దాదాపు 30 శాతం ప్రీమియంతో ముగిశాయి. ఇష్యూ ధర రూ.140 కాగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో రూ.165 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. బీఎస్ఈలో షేరు ధర 29.60 శాతం పెరిగి రూ.181.45 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈలో 29.64 శాతం లాభంతో రూ.181.50 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.13,968.81 కోట్లకు చేరింది. మిల్కీ మిస్ట్ ఐపీఓ 56.12 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. తమిళనాడుకు చెందిన ఈ కంపెనీ పనీర్, చీజ్, పెరుగు, బటర్, ఐస్‌క్రీమ్ వంటి పాల ఉత్పత్తులను అమ్ముతుంది.
సెన్సెక్స్ 492 పాయింట్లు డౌన్
ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో పాటు పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 492.70 పాయింట్లు పడిపోయి 77,235.46 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 132.75 పాయింట్ల నష్టంతో 24,154.90 స్థాయికి పతనమైంది. ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి.
యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగి బ్యారెల్‌కు 91.02 డాలర్లకు చేరుకుంది. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై తీవ్రంగా పడటంతో పలు రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.
