హైదరాబాద్సిటీ, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు అందిపుచ్చుకోవాలని మాజీ డీజీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. అందరూ ఏకమైతేనే సమాన ప్రాతినిధ్యం సాధ్యమవుతుందన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ మీడియా సెంటర్‌లో బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.
పూర్ణచందర్రావు మాట్లాడుతూ.. పాపన్న జీవిత చరిత్రను నేటి సామాజిక, రాజకీయ పరిస్థితులతో అనుసంధానించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్న తన కాలంలోని ఫ్యూడల్ అధికార నిర్మాణాన్ని సవాల్చేశారని పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్‌కుమార్ భావనా సాహెబ్ , విద్యార్థి నాయకుడు గణేశ్తదితరులు పాల్గొన్నారు.
