చార్మినార్: గుడుంబా విక్రయిస్తున్న మహిళపై పీడీ యాక్ట్

చార్మినార్: గుడుంబా విక్రయిస్తున్న మహిళపై పీడీ యాక్ట్

చార్మినార్, వెలుగు: ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం, గుడుంబా విక్రయాలకు పాల్పడుతున్న నెటుల శోభారాణి అలియాస్ లలితపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఉప్పుగూడ లలితాబాగ్‌‌‌‌కు చెందిన ఈమెపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏకంగా 33 కేసులు నమోదయ్యాయి. అయినా, తన పద్ధతి మార్చుకోకుండా వ్యాపారాన్ని కొనసాగించింది. 

ఇటీవల మరో 7 కేసుల్లో నిందితురాలిగా తేలింది. పదే పదే చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్న నేపథ్యంలో... నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఛత్రినాక పోలీసులు ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్ట్​ఉత్తర్వుల కాపీని అందజేసి, చంచల్‌‌‌‌గూడ మహిళా సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ కోటేశ్వర్ రావు తెలిపారు.